"డేనైట్ టెస్టు గులాబి బంతితో మనకి అచ్చిరాదు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ పిచ్‌ల్లో వారికి కలిసొస్తుంది.. స్పిన్నర్లు ప్రభావం చూపలేరు." ఇవన్నీ పింక్ టెస్టు ప్రారంభం ముందు భారత క్రికెట్ విశ్లేషకుల అంచనాలు.. వీటన్నింటిని తిప్పికొడుతూ.. ప్రతిభ, పట్టుదల ఉంటే గులాబి బంతితో చరిత్ర సృష్టించగలమని నిరూపించింది టీమిండియా.
చారిత్రక డేనైట్ టెస్టులో విజయం టీమిండియానే వరించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో గెలిచింది కోహ్లీసేన. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఇషాంత్ శర్మ 9 (5/22, 4/56), ఉమేశ్ యాదవ్ 8 (3/29, 5/53) వికెట్లతో రాణించారు.
-
India win by an innings and 46 runs in the #PinkBallTest
— BCCI (@BCCI) November 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
India become the first team to win four Tests in a row by an innings margin 😎😎@Paytm #INDvBAN pic.twitter.com/fY50Jh0XsP
">India win by an innings and 46 runs in the #PinkBallTest
— BCCI (@BCCI) November 24, 2019
India become the first team to win four Tests in a row by an innings margin 😎😎@Paytm #INDvBAN pic.twitter.com/fY50Jh0XsPIndia win by an innings and 46 runs in the #PinkBallTest
— BCCI (@BCCI) November 24, 2019
India become the first team to win four Tests in a row by an innings margin 😎😎@Paytm #INDvBAN pic.twitter.com/fY50Jh0XsP
గంటలోపే ముగిసిన మ్యాచ్
మూడోరోజు ఆట ప్రారంభమైన గంటలోపే ముగించేశారు భారత బౌలర్లు. బంగ్లాను 195 పరుగుల వద్ద ఆలౌట్ చేశారు. ఓవర్ నైట్ స్కోరు 156/6 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాను ఆరంభంలోనే దెబ్బతీశాడు ఉమేశ్. ఇబదత్ హొస్సేన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు.
-
This is #TeamIndia's 7 straight Test win in a row, which is our longest streak 🙌💪😎#PinkBallTest @Paytm pic.twitter.com/Lt2168Qidn
— BCCI (@BCCI) November 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is #TeamIndia's 7 straight Test win in a row, which is our longest streak 🙌💪😎#PinkBallTest @Paytm pic.twitter.com/Lt2168Qidn
— BCCI (@BCCI) November 24, 2019This is #TeamIndia's 7 straight Test win in a row, which is our longest streak 🙌💪😎#PinkBallTest @Paytm pic.twitter.com/Lt2168Qidn
— BCCI (@BCCI) November 24, 2019
ముష్ఫీకర్ ఒక్కడే..
అర్ధశతకంతో ఆకట్టుకున్న ముష్ఫీకర్(74).. అల్ అమిన్(21) సాయంతో రెండో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయితే ముష్ఫీకర్‌ను ఔట్ చేసి భారత విజయాన్ని ఖరారు చేశాడు ఉమేశ్. అతడు ఔటైన తర్వాత బంగ్లా ఓటమి లాంఛనమే అయింది.
ముందు ఇషాంత్, తర్వాత ఉమేశ్..
తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో ఆకట్టుకున్న ఇషాంత్.. రెండు ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో రాణించాడు. ఉమేశ్ యాదవ్ రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించి, 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టాపార్డర్‌ను ఇషాంత్ పడగొట్టగా.. టెయిలెండర్ల పనిపట్టాడు ఉమేశ్ యాదవ్.
మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బరిలో దిగిన టీమిండియా 347/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(136; 194 బంతుల్లో, 18 ఫోర్లు).. కెరీర్లో మరో శతకం సాధించాడు. టెస్టుల్లో 27వ సెంచరీ నమోదు చేశాడు. పుజారా(55), రహానే(51) అర్ధశతకాలతో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.