ETV Bharat / sports

భారత బౌలర్ల ధాటికి విండీస్ కుదేల్.. సిరీస్ కైవసం

వెస్టిండీస్ మహిళల జట్టుతో జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాధా యాదవ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. 5 టీ20ల సిరీస్​ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది భారత్.

భారత బౌలర్లు ధాటికి విండీస్ కుదేల్.. సిరీస్ కైవసం
author img

By

Published : Nov 15, 2019, 12:53 PM IST

వెస్టిండీస్ మహిళలతో జరిగిన తొలి రెండు టీ20ల్లో బ్యాటింగ్​తో అదరగొట్టిన భారత అమ్మాయిలు.. శుక్రవారం జరిగిన మూడో టీ20లో బౌలింగ్​తో సత్తాచాటారు. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసింది విండీస్. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 59 పరుగులే చేసింది. రాధా యాదవ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీసి కరీబియన్ జట్టు పతనాన్ని శాసించారు.

రోడ్రిగ్స్​కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్​..

అనంతరం బరిలోకి దిగిన టీమిండియా.. 3 వికెట్లు కోల్పోయి మూడు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 40 పరుగులతో ఆకట్టుకున్న టీమిండియా బ్యాట్స్​ఉమన్ జెర్మియా రోడ్రిగ్స్​కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

India women thrash West Indies to take unbeatable series lead
రోడ్రిగ్స్​

గత రెండు మ్యాచ్​ల్లో అర్ధశతకాలతో రెచ్చిపోయిన షెఫాలీ వర్మ డకౌట్​గా వెనుదిరగ్గా.. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 3 పరుగులే చేసింది.

బౌలర్ల విధ్వంసం..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ అమ్మాయిలు ఆరంభం నుంచి నిదానంగా ఆడారు. భారత బౌలర్లు ప్రత్యర్థిని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఫలితంగా తొలి పది ఓవర్లలో విండీస్ 3 వికెట్లు నష్టపోయి 26 పరుగులే చేయగలిగింది.

అనంతరం గేరు మార్చిన టీమిండియా అమ్మాయిలు వికెట్ల వేటలో పడ్డారు. దాదాపు ఓవర్​కొకరు చొప్పున తర్వాతి పది ఓవర్లలో 6 వికెట్లు తీశారు.

విండీస్ బ్యాట్స్​ఉమన్​లో చేడీన్ నేషన్(11), హెన్రీలదే(11) అత్యుత్తమ స్కోరు. మిగతా వారు సింగిల్ డిజిట్​కే పరిమతమయ్యారు.

ఎడం చేతి వాటం బౌలరైన రాధా యాదవ్ 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసింది. ఇందులో రెండు మెయిడెన్లు ఉండటం విశేషం. మరో పేసర్ దీప్తి శర్మ 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 2 వికెట్లతో ఆకట్టుకుంది. మిగతా బౌలర్లు తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

AP Video Delivery Log - 0600 GMT News
Friday, 15 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0557: Hong Kong Protest AP Clients Only 4240045
Protesters chant in Hong Kong's Central area
AP-APTN-0552: Cuba President AP Clients Only 4240044
Cuban President vists town near US base
AP-APTN-0541: Venezuela Guaido AP Clients Only 4240043
Venezuela's Guaido urges new anti-Maduro push
AP-APTN-0536: Sri Lanka Election Preview AP Clients Only 4240039
Security high on Sri Lankan voters' minds
AP-APTN-0456: Australia Wildfires No access Australia 4240036
Raging wildfires sweep through Australia
AP-APTN-0407: Mexico Morales AP Clients Only 4240035
Evo Morales wants UN mediation in Bolivia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.