బంగ్లాదేశ్తో రెండో టీ20 ఆడుతోన్న భారత క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో వంద మ్యాచ్లు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ మొదటి స్థానంలో ఉన్నాడు.
వంద టీ20లు ఆడిన టాప్-5 ఆటగాళ్లు
- షోయబ్ మాలిక్(పాకిస్థాన్)-111
- రోహిత్ శర్మ(భారత్) -100
- షాహిద్ అఫ్రిదీ(పాకిస్థాన్)-99
- ఎమ్.ఎస్ ధోనీ(భారత్)-98
- రాస్ టేలర్(కివీస్)-93
టీమిండియా మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్.. ఇంతకు ముందే 100 టీ20లు ఆడేసింది. ఈ ఘనతను ఇప్పటివరకు పది మంది మహిళా క్రికెటర్లు సాధించారు.
వంద టీ20లు ఆడిన టాప్-5 మహిళా క్రికెటర్లు
- సూజీ బేట్స్(న్యూజిలాండ్)-111
- ఎలైస్ పెర్రీ(ఆస్ట్రేలియా)-111
- దియేంద్రా డొటిన్(వెస్టిండీస్)-110
- సనా మిర్(పాకిస్థాన్)-106
- జెన్నీ గన్(ఇంగ్లాండ్)-104
బంగ్లాదేశ్తో రెండో టీ20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. రాజ్కోట్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. గెలిచి తీరాలనే కసితో ఉంది టీమిండియా. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ముందున్న బంగ్లా.. ఇందులోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.
ఇదీ చదవండి: టాస్ గెలిచిన భారత్... బంగ్లా బ్యాటింగ్