భారత సారథి విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది. అతడి ఆటోగ్రాఫ్ కోసం, ఫొటోల కోసం పోలీసుల భద్రతావలయం, బారికేడ్లు దాటుకొని మరీ వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు.
తాజాగా ఇండోర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టులో శనివారం ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. సెక్యూరిటీ నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ కోహ్లీ దగ్గరికి చేరుకున్నాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా మైదానం నుంచి అతడిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కానీ కోహ్లీ అలా చేయవద్దని సిబ్బందికి సూచించాడు. కొద్దిసేపు అతడి భుజంపై చేయి వేసి ముచ్చటించాడు. అనంతరం భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని తీసుకెళ్లారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అభిమాని పట్ల కోహ్లీ స్పందించిన తీరుని నెటిజన్లు కొనియాడుతున్నారు.
-
Virat Kohli putting his arm around a fan and requesting the security personnel to be gentle with the pitch invader #INDvBAN pic.twitter.com/rHcfyNmM7V
— Saj Sadiq (@Saj_PakPassion) November 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Virat Kohli putting his arm around a fan and requesting the security personnel to be gentle with the pitch invader #INDvBAN pic.twitter.com/rHcfyNmM7V
— Saj Sadiq (@Saj_PakPassion) November 16, 2019Virat Kohli putting his arm around a fan and requesting the security personnel to be gentle with the pitch invader #INDvBAN pic.twitter.com/rHcfyNmM7V
— Saj Sadiq (@Saj_PakPassion) November 16, 2019
బంగ్లాపై భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ స్టేడియానికి వచ్చి అభిమానులు ప్రోత్సహించడం వల్ల రెట్టింపు ఉత్సాహంగా ఆడి విజయం సాధించామని పేర్కొన్నాడు. కోల్‌కతా వేదికగా రెండో టెస్టు నవంబర్ 22న ప్రారంభం కానుంది.
-
Can any player show such gestures to his fan???
— Jayesh😎 (@jayeshvk16) November 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Whatta moment for the fan! ❤❤❤
Dream for anyone, that Kohli putting his hand on ur shoulder and showing his love! 😍 pic.twitter.com/PdYCGT5xOO
">Can any player show such gestures to his fan???
— Jayesh😎 (@jayeshvk16) November 16, 2019
Whatta moment for the fan! ❤❤❤
Dream for anyone, that Kohli putting his hand on ur shoulder and showing his love! 😍 pic.twitter.com/PdYCGT5xOOCan any player show such gestures to his fan???
— Jayesh😎 (@jayeshvk16) November 16, 2019
Whatta moment for the fan! ❤❤❤
Dream for anyone, that Kohli putting his hand on ur shoulder and showing his love! 😍 pic.twitter.com/PdYCGT5xOO
ఇదీ చూడండి: డీడీసీఏ అధ్యక్ష పదవికి రజత్ శర్మ రాజీనామా..!