ఇండోర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. మొదటిరోజు ఆటముగిసే సమయానికి 86/1తో నిలిచింది టీమిండియా. అంతకు ముందు బంగ్లా.. 150 పరుగులకు ఆలౌటైంది.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో 6 పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్‌తో కలిసి పుజారా.. బంగ్లా బౌలర్లను సమర్థమంతంగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ (37), పుజారా (43) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
A solid 72 run-partnership between Mayank (37*) & Pujara (43*) as #TeamIndia close Day 1 on 86/1 after bowling Bangladesh out for 150.
— BCCI (@BCCI) November 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard - https://t.co/0aAwHDwHed #INDvBAN pic.twitter.com/q2uhSBW5j3
">A solid 72 run-partnership between Mayank (37*) & Pujara (43*) as #TeamIndia close Day 1 on 86/1 after bowling Bangladesh out for 150.
— BCCI (@BCCI) November 14, 2019
Scorecard - https://t.co/0aAwHDwHed #INDvBAN pic.twitter.com/q2uhSBW5j3A solid 72 run-partnership between Mayank (37*) & Pujara (43*) as #TeamIndia close Day 1 on 86/1 after bowling Bangladesh out for 150.
— BCCI (@BCCI) November 14, 2019
Scorecard - https://t.co/0aAwHDwHed #INDvBAN pic.twitter.com/q2uhSBW5j3
భారత బౌలర్ల హవా
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 12 పరుగుల వద్ద ఓపెనర్ ఇమ్రుల్ కేయస్(6) వికెట్ తీశాడు ఇషాంత్. కాసేపటికే మరో ఓపెనర్ ఇస్లామ్‌ను(6) ఔట్ చేసి బంగ్లాను కష్టాల్లో పడేశాడు ఉమేశ్. క్రీజులో నిలదొక్కుకుంటున్న మిథున్‌ను(13) ఎల్బీడబ్ల్యూ చేశాడు షమి.
అనంతరం కెప్టెన్ మోమినుల్ హక్(37) - ముష్ఫికర్ రహీమ్(43) జోడీ బంగ్లా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నిలకడగా ఆడుతున్న మోమినుల్‌ను ఔట్ చేసి బంగ్లాను దెబ్బతీశాడు అశ్విన్. అక్కడి నుంచి బంగ్లా బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా 150 పరుగులకే ఆలౌటైంది బంగ్లా.
భారత బౌలర్లలో షమి మూడు వికెట్లతో సత్తాచాటగా... ఇషాంత్, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
ఇవీ చూడండి.. దిల్లీకి రహానే.. రాజస్థాన్ జట్టులోకి పృథ్వీషా!