భారత్‌తో జరిగిన తొలి టీ20లో విజయం బంగ్లాదేశ్‌నే వరించింది. 149 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాట్స్‌మెన్ ముష్ఫీకర్ రహీమ్(60) అర్ధశతకంతో చెలరేగి మ్యాచ్‌ను గెలిపించాడు. మరో ఆటగాడు సౌమ్యా సర్కార్ 39 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, యజువేంద్ర చాహల్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 1-0 తేడాతో ముందంజలో ఉంది బంగ్లా. టీ20ల్లో భారత్‌పై గెలవడం బంగ్లాకు ఇదే తొలిసారి.
-
That's that from Delhi. Bangladesh win the 1st T20I by 7 wickets and go 1-0 up in the 3-match series.#INDvBAN pic.twitter.com/z2ezFlifYx
— BCCI (@BCCI) November 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's that from Delhi. Bangladesh win the 1st T20I by 7 wickets and go 1-0 up in the 3-match series.#INDvBAN pic.twitter.com/z2ezFlifYx
— BCCI (@BCCI) November 3, 2019That's that from Delhi. Bangladesh win the 1st T20I by 7 wickets and go 1-0 up in the 3-match series.#INDvBAN pic.twitter.com/z2ezFlifYx
— BCCI (@BCCI) November 3, 2019
149 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే లిటన్ దాస్(7) వికెట్ కోల్పోయింది. అనంతరం మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు నయీమ్(26), సౌమ్యా సర్కార్(39). నిలకడగా ఆడుతున్న నయీమ్‌ను ఔట్ చేశాడు చాహల్. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ముష్ఫీకర్ రహీమ్.. సౌమ్యా సర్కార్ సాయంతో చెలరేగాడు. ఆరంభంలో నిదానంగా ఆడినా.. అనంతరం బ్యాట్ ఝుళిపించాడు.
మలుపు తిప్పిన ఓవర్..
18వ ఓవర్ వరకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. 2 ఓవర్లో 21 పరుగులు చేయాల్సిన తరుణంలో ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్లో 18 పరుగులు రాబట్టింది బంగ్లాదేశ్. ముష్ఫీకర్ 4 బౌండరీలతో జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. చివరి ఓవర్‌కు 4 పరుగులే అవసరం కాగా మ్యాచ్‌ను సిక్సర్‌తో ముగించాడు కెప్టెన్ మహ్మదుల్లా(15).
-
Bangladesh win by seven wickets!
— ICC (@ICC) November 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A fabulous 60* from 43 by Mushfiqur Rahim guides the visitors to victory.#INDvBAN | SCORECARD 👇 https://t.co/qBFzQDJ3Bs pic.twitter.com/rPd8KV8uMX
">Bangladesh win by seven wickets!
— ICC (@ICC) November 3, 2019
A fabulous 60* from 43 by Mushfiqur Rahim guides the visitors to victory.#INDvBAN | SCORECARD 👇 https://t.co/qBFzQDJ3Bs pic.twitter.com/rPd8KV8uMXBangladesh win by seven wickets!
— ICC (@ICC) November 3, 2019
A fabulous 60* from 43 by Mushfiqur Rahim guides the visitors to victory.#INDvBAN | SCORECARD 👇 https://t.co/qBFzQDJ3Bs pic.twitter.com/rPd8KV8uMX
భారత్ 6 వికెట్లు నష్టానికి 148 పరుగులు చేసింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై శిఖర్ ధావన్(41) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. బంగ్లా బౌలర్లలో అమినుల్ హసన్, షఫియిల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు తీయగా.. ఆఫిఫ్ హొస్సేన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదీ చదవండి: 9 పరుగులకే ఔటైనా... ధోనీ, కోహ్లీ రికార్డులు బ్రేక్