సౌరభ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కీలక మార్పులు తీసుకు రాబోతున్నాడని, భారత్ ఆడిన తొలి డే/నైట్ టెస్టుతోనే తేలింది. దాదా.. సెలక్షన్ ప్యానెల్లోనూ బలమైన మార్పులు తీసుకురావాలని టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతమున్న కమిటీని ప్రక్షాళన చేసి, శక్తిమంతమైన సభ్యులను తీసుకోవాలని ట్వీట్ చేశాడు.
-
I guess they r testing his heart 💔 #selectionpanelneedtobechanged need strong people there.. hope dada @SGanguly99 will do the needful https://t.co/RJiGVqp7nk
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I guess they r testing his heart 💔 #selectionpanelneedtobechanged need strong people there.. hope dada @SGanguly99 will do the needful https://t.co/RJiGVqp7nk
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 25, 2019I guess they r testing his heart 💔 #selectionpanelneedtobechanged need strong people there.. hope dada @SGanguly99 will do the needful https://t.co/RJiGVqp7nk
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 25, 2019
"ఈ సెలక్షన్ ప్యానెల్‌ను మార్చాలి. శక్తిమంతమైన, అనుభవజ్ఞులైన వారిని సభ్యులుగా తీసుకురావాలి. గంగూలీ ఈ మార్పులు తీసుకువస్తాడని నేను అనుకుంటున్నా" -హర్భజన్ సింగ్, టీమిండియా సీనియర్ క్రికెటర్
అంతకు ముందు వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం పట్ల కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్నే రీట్వీట్ చేస్తూ పై విధంగా అభిప్రాయం వ్యక్తం చేశాడు హర్భజన్ సింగ్.
-
Very disappointed to see @IamSanjuSamson dropped without a chance. He carried the drinks for three T20Is & has been promptly discarded. Are they testing his batting or his heart? https://t.co/ydXgwOylBi
— Shashi Tharoor (@ShashiTharoor) November 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Very disappointed to see @IamSanjuSamson dropped without a chance. He carried the drinks for three T20Is & has been promptly discarded. Are they testing his batting or his heart? https://t.co/ydXgwOylBi
— Shashi Tharoor (@ShashiTharoor) November 21, 2019Very disappointed to see @IamSanjuSamson dropped without a chance. He carried the drinks for three T20Is & has been promptly discarded. Are they testing his batting or his heart? https://t.co/ydXgwOylBi
— Shashi Tharoor (@ShashiTharoor) November 21, 2019
"సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుపోవడం చాలా నిరాశగా అనిపించింది. ఒక్క అవకాశమైన ఇవ్వకుండా మూడు టీ20ల్లోనూ మైదానంలో డ్రింక్స్ తీసుకొచ్చేందుకు వినియోగించారు. అతడి హృదయాన్ని పరీక్షిస్తున్నారా? లేదా బ్యాటింగ్‌ను పరిశీలిస్తున్నారా?" -శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ.
ప్రస్తుతమున్న సెలక్షన్ కమిటీ.. ఎమ్మేస్కే ప్రసాద్ నేతృత్వంలో పనిచేస్తోంది. ఇందులో దేవాంగ్ గాంధీ, జతిన్, సరందీప్ సింగ్, గగన్ ఖోడా తదితరులు ఇతర సభ్యులు.
సంజూ శాంసన్ 2015లో జింబాబ్వేతో జరిగిన ఒకే ఒక అంతర్జాతీయ టీ20 ఆడాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 112 పరుగులు చేశాడు.
ఇదీ చదవండి: 'గులాబి' టెస్టులో రెండు రోజుల టికెట్ల సొమ్ము వాపసు