భారత యువ క్రికెటర్ రిషభ్‌పంత్‌కు అండగా నిలిచాడు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ. పంత్‌కు కుదురుకునేందుకు కాస్త సమయమివ్వాలని అన్నాడు. దాదాతో పాటు పంత్‌కు సలహాలిచ్చాడు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర.
"పంత్ గొప్ప క్రికెటర్. కాకపోతే అతడికి కాస్త సమయమివ్వాలి. అప్పుడే కుదరుకుంటాడు. రిషభ్ నెమ్మదిగా పరిణితి చెందుతాడు" -సౌరభ్ గంగూలీ, టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు
పంత్ కీపింగ్, బ్యాటింగ్ సరళంగా మార్చాలని లంక మాజీ క్రికెటర్ సంగక్కర అన్నాడు. అప్పుడే వైఫల్యాల నుంచి ఫంత్ బయటపడతాడని చెప్పాడు.
"పంత్ తన బలహీనతలను అర్థం చేసుకొని బ్యాటింగ్, కీపింగ్‌ను సరళంగా మార్చకోవాలి. వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ఆడాలి. ఒత్తిడి దరిచేరనీయొద్దు. ఒక వికెట్ కీపర్ వికెట్ల వెనకాల పద్ధతిగా, చక్కగా ఉండాలి. అప్పుడే అతడు ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని పంత్ తన పాత్రను అర్థం చేసుకొని సారథికి సరైన సమాచారం ఇవ్వడం అత్యంత కీలకం" -రిషభ్ పంత్, టీమిండియా క్రికెటర్
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో శతకాలు చేసిన పంత్ ప్రస్తుతం పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. వికెట్ల వెనక తప్పిదాలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గురువారం.. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లోనూ వికెట్ల కంటే ముందు బంతిని అందుకొని స్టంపౌట్ చేశాడు.