ఆడిలైడ్‌లో ఆదివారం శ్రీలంకతో జరిగిన టీ20లో 134 పరుగుల భారీ తేడాతో ఆసీస్ గెలిచింది. ఓపెనర్ వార్నర్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన ఓ చిన్నారి అభిమానికి అనుకోని బహుమతి ఇచ్చాడీ క్రికెటర్.
మ్యాచ్ సందర్భంగా ప్రాక్టీసు చేసిన అనంతరం వార్నర్.. డ్రెస్సింగ్ రూంకు వెళుతూ అక్కడే ఉన్న ఓ చిన్నారి అభిమానికి తన గ్లౌవ్స్ బహుమతిగా ఇచ్చేశాడు. దీనిని ఊహించని ఆ పిల్లాడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
-
These young fellas won't ever forget their trip to the cricket today. All class from @davidwarner31 👏 #AUSvSL pic.twitter.com/3z57vgwuS9
— cricket.com.au (@cricketcomau) October 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">These young fellas won't ever forget their trip to the cricket today. All class from @davidwarner31 👏 #AUSvSL pic.twitter.com/3z57vgwuS9
— cricket.com.au (@cricketcomau) October 27, 2019These young fellas won't ever forget their trip to the cricket today. All class from @davidwarner31 👏 #AUSvSL pic.twitter.com/3z57vgwuS9
— cricket.com.au (@cricketcomau) October 27, 2019
ఈ మ్యాచ్‌లో శతకం చేసిన వార్నర్.. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మూడో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అదే విధంగా టీ20ల్లో అతడికిదే తొలి శతకం.
ఇది చదవండి: ఈ సైకిల్ పోటీలు చూస్తే.. చూపు తిప్పుకోలేరు!