ETV Bharat / sports

ఆస్ట్రేలియా క్రికెట్​లో విషాదానికి ఐదేళ్లు - Phillip Hughes

మైదానంలో ఓ బౌన్సర్​ తగిలి.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణించి నేటికి ఐదేళ్లు. ఈ సందర్భంగా క్రీడాలోకం అతడికి నివాళులర్పించింది.

Phillip Hughes
హ్యూస్
author img

By

Published : Nov 27, 2019, 9:24 AM IST

క్రికెట్లో పేసర్లు బౌన్సర్లతో బ్యాట్స్​మన్​ను ఇబ్బందిపెట్టడం మామూలే. కానీ అదే బౌన్సర్​ ఓ క్రికెటర్​ను బలితీసుకుంటే..! అదో విషాదం. ఇలాంటి సంఘటనే 2014లో జరిగిన షెఫీల్డ్​ షీల్డ్​ టోర్నీలో చోటుచేసుకుంది. ఓ వర్ధమాన క్రికెటర్ మరణానికి కారణమైంది.

ఏం జరిగింది?

షెఫీల్డ్‌ షీల్డ్‌లో భాగంగా 2014 నవంబర్‌ 25న సిడ్నీ క్రికెట్‌ మైదానంలో సౌత్‌ ఆస్ట్రేలియా, న్యూసౌత్‌ వేల్స్‌ తలపడ్డాయి. ప్రత్యర్థి పేసర్‌ అబాట్ విసిరిన బౌన్సర్‌.. సౌత్‌ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ హ్యూస్‌ తలకు బలంగా తగిలింది. హెల్మెట్‌ ధరించినప్పటికీ రక్షణ లేని ఎడమచెవి కింది భాగంలో బంతి తాకింది. అతడు వెంటనే కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. రెండు రోజుల మృత్యువుతో పోరాడి ఆసుపత్రిలో కన్నుమూశాడు. అప్పటికి హ్యూస్‌ వయసు 25 ఏళ్లు.

ఫిలిప్ హ్యూస్‌కు, క్రికెట్‌ ఆస్ట్రేలియా నివాళి అర్పించింది. ఐదో వర్ధంతి సందర్భంగా అతడి సేవలను స్మరించుకుంది.

ఆసీస్‌ తరఫున 25 టెస్టులు, 24 వన్డేలు ఆడిన హ్యూస్‌.. ఇంగ్లాండ్‌లో చాలాకాలం కౌంటీ క్రికెట్‌ ఆడాడు. అతడికి జరిగినట్లు మరెవ్వరికీ జరగొద్దన్న ఉద్దేశంతో క్రికెటర్లు నెక్‌ గార్డులు ధరించాలని ఆస్ట్రేలియా బోర్డు ఆదేశించింది. ఇబ్బందిగా ఉంటుందని చాలామంది వాటిని వినియోగించడం లేదు. ఈ క్రమంలోనే యాషెస్‌ సిరీస్‌లో పాల్గొన్న స్టీవ్‌ స్మిత్‌ తలకు బలమైన బౌన్సర్‌ తగిలింది. ఆ తర్వాత నెక్‌గార్డ్‌ ధరించి 211 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భవిష్యత్తులో గార్డ్ తప్పక ధరిస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే నెక్‌ గార్డుల్ని తప్పనిసరి చేయాలని ఐసీసీ భావిస్తోంది.

ఇవీ చూడండి.. భారత మాజీ క్రికెటర్ గంభీర్​కు అరుదైన గౌరవం

AP Video Delivery Log - 0000 GMT News
Wednesday, 27 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2356: US AZ Bloomberg 2020 No access US 4241973
Bloomberg in Arizona to promote presidential bid
AP-APTN-2324: Bolivia Politics AP Clients Only 4241970
Senate president: 'mistakes' made in Morales turmoil
AP-APTN-2312: Colombia Clashes AP Clients Only 4241969
Tear gas and water cannon used at Colombia protest
AP-APTN-2309: Mideast Rockets Must credit Dudi Poled 4241967
Israel military: rockets fired at Israel from Gaza
AP-APTN-2227: US CA Wildfire Update Must credit KABC; No access Los Angeles; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4241966
Residents return as California blaze continues
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.