క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి తబంగా మూరెపై వేటు పడింది. దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతణ్ని సస్పెండ్ చేస్తున్నట్లు సీఎస్‌ఏ ప్రకటించింది. మూరేతో పాటు సీఎస్‌ఏ బోర్డు అంతా రాజీనామా చేయాలని అంతకన్నా ముందు దక్షిణాఫ్రికా క్రికెటర్ల సంఘం (ఎస్‌ఏసీఏ) డిమాండ్ చేసింది.
బోర్డుతో ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని ఓ స్పాన్సర్ చెప్పింది. సీఎస్‌ఏ అనేక వివాదలతో సంక్షోభంలో చిక్కుకుంది. దేశవాళీ క్రికెట్ పునర్‌వ్యవస్థీకరణ, ఇంకా ఇతర అంశాలకు సంబంధించి సీఎస్‌ఏపై ఎస్‌ఏసీఏ ఆగ్రహంగా ఉంది. సమ్మెకు దిగుతామని కూడా హెచ్చరించింది.
ఇవీ చూడండి.. 'సిరీస్లో 2 డే/నైట్ టెస్టులా.. మరీ టూమచ్'