టీమిండియా మిస్టర్కూల్ మహేంద్రసింగ్ ధోనీకి 15ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో మధుర స్మృతులున్నాయట. ముఖ్యంగా వాటిలో రెండు జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని అంటున్నాడు మహీ. తొలిసారి తన సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్ తర్వాత జరిగిన ఘటన ఒకటి కాగా.. 2011లో భారత్ విశ్వవిజేతగా నిలిచిన సందర్భం రెండోదని చెప్పాడు ధోనీ.
వారి కళ్లల్లో ఆనందం చూశా: ధోనీ
2007 ప్రపంచకప్ గెలిచిన అనంతరం మేము భారత్కు తిరిగొచ్చాం. బస్సులో ముంబయిలో మెరైన్ డ్రైవ్ మీదుగా ప్రయాణిస్తున్నాం. మొత్తం రొడ్డంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతో మంది మమ్మల్ని చూసేందుకు అక్కడికి వచ్చారు. వాళ్లల్లో ముఖ్యమైన పనిమీద వెళ్లే వారుంటారు. వివాహ వేడుకల వేళ్లేవారుంటారు, కొంతమందికి ఫ్లైట్ మిస్సయి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి కళ్లల్లో ఆనందం. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇప్పటికీ ఆ సంఘటన కళ్ల ముందే మెదులుతూనే ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అందరి నోట ఒకటే మాట..
2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో రెండో సంఘటన జరిగింది. విజయానికి ఇంకా 15-20 పరుగులు చేయాల్సి ఉంది. వాంఖడే మైదానంలో ఒకటే మాట వినిపిస్తోంది. 'వందేమాతరం' అంటూ స్టేడియమంతా ప్రతిధ్వనించేలా అరిచారు. ఆ ఘటన నా హృదయానికి హత్తుకుంది.ఈ రెండు సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేను.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచకప్ తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిరవధిక విరామం తీసుకున్నాడు. రెండు నెలలు సైన్యంలో చేరాడు. ఆ తర్వాత ఇంటి వద్దకు వచ్చేసినా జట్టుకు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయంపై ప్రశ్నించగా ‘జనవరి వరకు నన్నేమీ అడగొద్దు’ అని స్పష్టంగా చెప్పాడు.
ఇదీ చదవండి: తొలి టీ20 హైదరాబాద్లో.. చివరిది ముంబయిలో