ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వర్ణ వివక్ష ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్ని అతడు స్వయంగా చెప్పాడు. బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఓ వ్యక్తి తనను అవమానించేలా మాట్లాడాడని ట్వీట్ చేశాడు.
-
A bit disturbing hearing racial insults today whilst battling to help save my team , the crowd was been amazing this week except for that one guy , @TheBarmyArmy was good as usual also
— Jofra Archer (@JofraArcher) November 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A bit disturbing hearing racial insults today whilst battling to help save my team , the crowd was been amazing this week except for that one guy , @TheBarmyArmy was good as usual also
— Jofra Archer (@JofraArcher) November 25, 2019A bit disturbing hearing racial insults today whilst battling to help save my team , the crowd was been amazing this week except for that one guy , @TheBarmyArmy was good as usual also
— Jofra Archer (@JofraArcher) November 25, 2019
"ఈ రోజు నేను బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు అవమానానికి గురయ్యాను. నా రంగు గురించి మాట్లాడుతూ ఓ వ్యక్తి నేను బాధపడేలా చేశాడు. అతడు మినహా మిగతా వారంతా మాకు చక్కటి మద్దతునిచ్చారు" - జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ బౌలర్.
ఈ అంశంపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్పందించింది. బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని తమ వంతుగా ఆర్చర్‌ను క్షమాపణలు కోరింది.
"ఎవరైతే జోఫ్రా ఆర్చర్‌ను అవమానించేలా మాట్లాడాడో అతడిని భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం. బాధ్యుడిని గుర్తించి చర్యలు చేపడతాం. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. ఇకపై క్రికెట్ వేదికల్లో అవమానకరంగా మాట్లాడినా, పరుష పదజాలంతో దూషించినా పోలీసులు రంగంలో దిగేలా చర్యలు తీసుకుంటాం. అనుకోని పరిస్థితుల్లో ఆర్చర్‌కు జరిగిన ఈ అవమానాననికి క్షమాపణలు కోరుతున్నాం. హామిల్టన్‌లో జరగబోయే తర్వాతి మ్యాచ్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని ఆర్చర్‌కు హామీ ఇస్తున్నాం" -న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.
-
NZC Statement - https://t.co/qMYhSZfnR1
— BLACKCAPS (@BLACKCAPS) November 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">NZC Statement - https://t.co/qMYhSZfnR1
— BLACKCAPS (@BLACKCAPS) November 25, 2019NZC Statement - https://t.co/qMYhSZfnR1
— BLACKCAPS (@BLACKCAPS) November 25, 2019
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్.. ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 55/3తో సోమవారం ఐదో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లీష్ జట్టు.. 197 పరుగులకే ఆలౌటైంది. నీల్ వాగ్నర్ 5, మిచెల్ శాంట్నర్ 3 వికెట్లతో సత్తాచాటారు. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ బోణీ కొట్టింది.
ఇదీచదవండి: క్రికెట్ ఆస్ట్రేలియా నూతన సెలక్టర్‌గా జార్జ్ బెయిలీ!