బీసీసీఐ గురువారం భారత జట్టు సీనియర్ ఆటగాళ్ల వార్షిక ఆదాయ ఒప్పందాల్ని ప్రకటించింది. ఈ జాబితాను నాలుగు భాగాలుగా విభజించారు. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 వరకు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. గ్రేడ్ ఏ ప్లస్ ఆటగాళ్లకు రూ.7 కోట్లు ఇవ్వనుండగా, గ్రేడ్ ఏ ఆటగాళ్లకి రూ.5 కోట్లు, గ్రేడ్ బి వారికి రూ.3 కోట్లు, గ్రేడ్ సి వారికి రూ.1 కోటి చొప్పున చెల్లించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ జాబితాలో టీమిండియా మాజీ సారథి ధోనీ పేరు లేకపోవడం గమనార్హం. అతడి రిటైర్మెంట్ వార్తలకు ఇది మరింత బలాన్ని చేకూరిస్తోంది.
- గ్రేడ్-ఏ ప్లస్:
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా
- గ్రేడ్ ఏ:
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, పుజారా, కేఎల్ రాహుల్, రహానే, ధావన్, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్
- గ్రేడ్ బి:
వృద్ధిమాన్ సాహా, ఉమేష్ యాదవ్, యుజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్,
- గ్రేడ్ సి:
కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, మనీష్ పాండే, హనుమ విహారీ, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్