ETV Bharat / sports

'ఆటను అర్థం చేసుకుంటే ఎందులోనైనా ఆడొచ్చు' - mayank agerwal

ఆడే ప్రతి మ్యాచ్​ గెలవాలనుకుంటానని చెప్పాడు టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్. ఆటను అర్థం చేసుకుంటే ఏ ఫార్మాట్లోనైనా రాణించొచ్చని అన్నాడు. విండీస్​తో మూడు వన్డేల సిరీస్​కు ఎంపికయ్యాడీ బెంగళూరు బ్యాట్స్​మన్.

Basics remain the same: Mayank Agarwal on adapting to different formats
'ఆటను అర్థం చేసుకుంటే ఎందులోనైనా ఆడొచ్చు'
author img

By

Published : Dec 14, 2019, 9:36 AM IST

మయాంక్ అగర్వాల్.. ఆరు నెలల క్రితం వరకు భారత వన్డే క్రికెట్​ జట్టులో స్థానం దక్కితే గొప్ప విషయం అతడిది.. కట్ చేస్తే మూడు పార్మాట్లలోనూ ఆడే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ఇటీవల టెస్టు సిరీస్​లో తనదైన శైలిలో విజృంభించి తాజాగా విండీస్​తో వన్డే సిరీస్​కు ఎంపికయ్యాడు. ఎరుపు బంతి క్రికెట్​ నుంచి తెల్ల బంతికి ఏ విధంగా మారాడో చెప్పాడు మయాంక్.

"మనస్ఫూర్తిగా క్రికెట్ ఆడలేకపోతే.. అసలు ఆట ఆడకుండా ఉంటేనే మంచిది. అదే నేను నమ్ముతా. క్రికెట్​లో ఏ ఫార్మాట్లోనైనా మూలాలు ఒకేలా ఉంటాయి. ఫార్మాట్​ మారినప్పుడు గేమ్ ప్లాన్ స్పష్టంగా ఉండి.. ఆటను అర్థం చేసుకోగలిగితే ఎందులోనైనా రాణించగలం. మ్యాచ్​ ఆడేటప్పుడు జట్టుకు నేనెలా ఉపయోగపడగలను, ఏ మేరకు ఆకట్టుకోగలను అనేదే ఆలోచిస్తా. ఒకవేళ నేను పరుగులు చేయనప్పటికీ.. ఫీల్డింగ్​లో సత్తాచాటేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తా" -మయాంక్ అగర్వాల్, టీమిండియా క్రికెటర్.

తాను ఆడే ప్రతి మ్యాచ్​ గెలవాలనుకుంటానని, ఆ తలంపుతోనే బరిలోకి దిగుతానని చెప్పాడు మయాంక్ అగర్వాల్. అయితే ప్రతి మ్యాచ్​లో 100 శాతం ఆడతామనే గ్యారెంటీ లేదని, మంచి ప్రదర్శన చేసేందుకు చూడాలని తెలిపాడు.

టెస్టుల్లో ఆడిన చివరి ఆరు ఇన్నింగ్స్​ల్లో మూడు శతకాలు చేశాడు మయాంక్​ అగర్వాల్. ఇందులో రెండు డబుల్ సెంచరీలు(215, 243) ఉన్నాయి. ఇటీవల బంగ్లాదేశ్​తో జరిగిన పింక్ టెస్టులో రెండో ద్విశతకం నమోదు చేశాడు.

ఇదీ చదవండి: 'కూర్పు'లో నిలిచి తుదిజట్టులో ఉండేదెవరో..!

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Saturday 14th December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Copa Libertadores champion Flamengo depart to Doha for Club WC. Already moved.
SOCCER: Freddie Ljungberg on Arsenal's EPL match with Manchester City. Already moved.
SOCCER: Willem II go third in Dutch Eredivisie with 2-1 win at Heerenveen. Already moved.
NHL: Stanley Cup-winning goalie Tim Thomas details costs of career-ending concussion. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.