ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీకి కీలక పదవి లభించనుంది. ఆ జట్టు నూతన సెలక్టర్‌గా అతడి నియామకానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్యానెలో ఇతడితో పాటు ఆసీస్ జాతీయ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ట్రెవర్ హాన్స్ ఉన్నట్లు ఆ దేశానికి చెందిన ఓ వార్తా పత్రిక కథనం ప్రచురించింది.
జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వారిలో బెయిలీ మూడో వ్యక్తి. ఇంతకుముందు సర్ డాన్ బ్రాడ్‌మన్, మైకేల్ క్లార్క్ లాంటి దిగ్గజ క్రికెటర్లూ సెలక్టర్‌గా పని చేశారు.
సెలక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బెయిలీ.. బిగ్‌బాష్ లీగ్ హోబర్ట్ హరికేన్స్ తరఫున ఇంకా ఆడుతూనే ఉండటం విశేషం. 5 టెస్టులు, 90 వన్డేలు, 30 టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించాడీ క్రికెటర్.
2013-14 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్ జట్టులో బెయిలీ సభ్యుడు. చివరగా 2017 సెప్టెంబరులో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ఆడాడు.
ఇదీ చదవండి: ఈ సెలక్షన్ కమిటీని ప్రక్షాళన చేయాలి: హర్భజన్