బ్రిస్బేన్‌లో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది కంగారూ జట్టు.
-
🤜🤛
— ICC (@ICC) October 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
After losing a wicket in the very first over of the chase, Steve Smith and David Warner have added 96 runs to put Australia on course at the halfway stage of the chase, with the latter bringing up his half-century off just 30 balls.#AUSvSL ⬇️ https://t.co/OctpFCDWhl pic.twitter.com/ctOHTm0se9
">🤜🤛
— ICC (@ICC) October 30, 2019
After losing a wicket in the very first over of the chase, Steve Smith and David Warner have added 96 runs to put Australia on course at the halfway stage of the chase, with the latter bringing up his half-century off just 30 balls.#AUSvSL ⬇️ https://t.co/OctpFCDWhl pic.twitter.com/ctOHTm0se9🤜🤛
— ICC (@ICC) October 30, 2019
After losing a wicket in the very first over of the chase, Steve Smith and David Warner have added 96 runs to put Australia on course at the halfway stage of the chase, with the latter bringing up his half-century off just 30 balls.#AUSvSL ⬇️ https://t.co/OctpFCDWhl pic.twitter.com/ctOHTm0se9
సీనియర్లు మెరుపులు...
తొలి టీ20లో శతకంతో చెలరేగిన వార్నర్ (60*) మరోసారి మెరిశాడు. వార్నర్‌కు తోడుగా స్మిత్ (53*) కూడా చెలరేగడం వల్ల ఆసీస్ 13 ఓవర్లలోనే 118 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాట్స్‌మెన్‌లో కుశాల్ పెరెరా(27), దనుష్క (21) మాత్రమే రెండు పదుల స్కోరును అందుకోగలిగారు. ఆసీస్ బౌలర్లలో బిల్లీ, కమిన్స్, ఆస్టన్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టును మలింగ ఆదిలోనే ఎదురుదెబ్బ తీశాడు. ఫించ్‌ను ఖాతా తెరవక ముందే పెవిలియన్‌కు పంపాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన స్మిత్‌తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్‌ను నడిపి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలి మ్యాచ్‌లో ఆసీస్ 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం జరగనుంది.