అడిలైడ్ వేదికగా జరుగుతున్న మార్ష్ వన్డే కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్‌కు తీవ్ర గాయమైంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ఆస్టన్ ప్రాతినిథ్యం వహిస్తుండగా అతడి తమ్ముడు వెస్ అగర్... సౌత్ ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే ఇరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో... వెస్ అగర్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడానికి ప్రయత్నించిన ఆస్టన్ అదుపుతప్పి కిందపడిపోయాడు. బంతి నేరుగా వచ్చి అతడి ముక్కుకి బలంగా తగలడం వల్ల రక్తస్రావమైంది. వెంటనే స్పందించిన నిపుణుల బృందం అతడికి వైద్య సేవలు అందించింది.
-
GRAPHIC CONTENT: Not for the faint-hearted, here is the footage of Agar's knock. Ouch! #MarshCup pic.twitter.com/h6Jj3drPsO
— cricket.com.au (@cricketcomau) November 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">GRAPHIC CONTENT: Not for the faint-hearted, here is the footage of Agar's knock. Ouch! #MarshCup pic.twitter.com/h6Jj3drPsO
— cricket.com.au (@cricketcomau) November 17, 2019GRAPHIC CONTENT: Not for the faint-hearted, here is the footage of Agar's knock. Ouch! #MarshCup pic.twitter.com/h6Jj3drPsO
— cricket.com.au (@cricketcomau) November 17, 2019
ప్రస్తుతం అగర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తన సోదరుడు వెస్ అగర్ తెలిపాడు.
"అదుపుతప్పి ఆస్టన్ కింద పడ్డాడు. బంతి నేరుగా వచ్చి అతడి కళ్లద్దాలకు తగిలింది. అవి పగలడం వల్ల అతడికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో నేను ఏమి ఆలోచించకుండా క్రీజులో నుంచి నేరుగా అతడి వద్దకు పరిగెత్తా. అతడి గాయంపై చింతిస్తున్నా. ప్రస్తుతం ఆస్టన్ బాగానే ఉన్నాడు".
-- వెస్ అగర్
అదృష్టవశాత్తు అతడి కళ్లకు ఎటువంటి దెబ్బ తగల్లేదని... గాయం తీవ్రత ఎక్కువైతే కంటి చూపుకు ఇబ్బందులు తలెత్తేవని వైద్యులు అభిప్రాయపడ్డారు.
ఆసీస్ తరఫున ఆస్టన్ ఇప్పటివరకు 4 టెస్టులు, 9 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. టెస్టుల్లో తొమ్మిది వికెట్లతో పాటు 195 పరుగులు బాదాడు. వన్డేల్లో 8 వికెట్లు, 144 పరుగులు, పొట్టి ఫార్మాట్‌లో 17 వికెట్లు, 82 పరుగులు చేశాడు.