అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా.. ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఆసీస్ బౌలర్లలో లైయన్ 5 వికెట్లతో ఆకట్టుకోగా... హేజిల్‌వుడ్ 3, మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీశారు.
వార్నర్ 'మ్యాన్ ఆఫ్ ద' సిరీస్
రెండు టెస్టుల్లో రెండు సెంచరీలతో ఆకట్టుకున్న వార్నర్‌కు 'మ్యాన్ ఆఫ ద సిరీస్' అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో ట్రిపుల్ చేసినందుకు 'మ్యాన్ ఆఫ్ మ్యాచ్' సొంతం చేసుకున్నాడు. పాక్‌పై తొలి టెస్టులో 154 పరుగులు చేసిన వార్నర్.. డే/నైట్ మ్యాచ్‌లో 335 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండు టెస్టుల్లో కలిపి 489 పరుగులు చేశాడు.
-
Australia opener David Warner is Player of the Match for his sensational triple hundred! 👏#AUSvPAK pic.twitter.com/biGHUrkxSl
— ICC (@ICC) December 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Australia opener David Warner is Player of the Match for his sensational triple hundred! 👏#AUSvPAK pic.twitter.com/biGHUrkxSl
— ICC (@ICC) December 2, 2019Australia opener David Warner is Player of the Match for his sensational triple hundred! 👏#AUSvPAK pic.twitter.com/biGHUrkxSl
— ICC (@ICC) December 2, 2019
ఇన్నింగ్స్ పరాభవం తప్పలేదు..
39/3 స్కోరు వద్ద నాలుగోరోజు ఆట ప్రారంభించిన పాకిస్థాన్.. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకునేందుకు పోరాడింది. షాన్ మసూద్, అసద్ షఫీక్ అర్ధశతకాలతో ఆసీస్ బౌలర్లను కాసేపు ప్రతిఘటించారు. వీరిద్దరూ 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే మసూద్‌ను ఔట్ చేసిన లైయన్.. ఈ జోడీని విడదీశాడు.
చివర్లో మహ్మద్ రిజ్వాన్ కాసేపు క్రీజులో నిలుచున్నప్పటికీ.. పాక్ పరాజయాన్ని మాత్రం తప్పించలేకపోయాడు. ఆసీస్ బౌలర్లు, లైయన్, హేజిల్‌వుడ్ ధాటికి దాయాది బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా.. 589/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. డేవిడ్ వార్నర్(335*) త్రిశతకంతో చెలరేగగా.. లబుషేన్(162) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం పాకిస్థాన్ 302 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. యాసిర్ షా(113) సెంచరీ, బాబర్ అజాం 97 పరుగులతో రాణించినప్పటికీ పాక్‌ను ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ స్టార్క్ 6 వికెట్లు తీశాడు.
ఇదీచదవండి: దక్షిణాసియా క్రీడల్లో భారత్ బోణీ.. ఒకే రోజు 4 పతకాలు