ETV Bharat / sports

విరాట్ ఎందుకు అతిగా స్పందిస్తాడు: కీరన్ పొలార్డ్​ - పొలార్డ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని, ఎందుకు అలా ఉన్నాడో తెలియట్లేదన్నాడు విండీస్ సారథి పొలార్డ్. విశాఖ వన్డేలో భారత ఇన్నింగ్స్​లోని చివరి పది ఓవర్లే తమ ఓటమికి కారణని చెప్పాడు.

Ask Kohli why is he so animated: WI skipper Kieron Pollard
విరాట్ - పొలార్డ్
author img

By

Published : Dec 19, 2019, 11:09 AM IST

Updated : Dec 19, 2019, 11:18 AM IST

దూకుడుగా బ్యాటింగ్​ చేసే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఎదుటివారు కవ్విస్తే అంతే చురుకుగా కౌంటర్​ ఇస్తాడు. విశాఖపట్నంలో వెస్టిండీస్​తో జరిగిన రెండో వన్డేలో అతడు వ్యవహరించిన తీరుపై కరీబియన్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ స్పందించాడు. విరాట్ ఎందుకు అంత అతిగా స్పందిస్తాడో అర్ధం కావట్లేదని అన్నాడు.

"విరాట్ ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తాడో అతడిని మీరు అడగండి. ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్పలేను. ఈ అంశం గురించి నాకేమి తెలియదు" - కీరన్ పొలార్డ్, విండీస్ కెప్టెన్​.

ఇటీవలే టీ20 సిరీస్​లో విండీస్ ఆటగాడు విలియమ్సను నోట్​బుక్​ టిక్​తో అనుకరించాడు కోహ్లీ. తొలివన్డేలో రవీంద్ర జడేజా రనౌట్​పై అంపైర్​పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండో వన్డేలో పొలార్డ్ డకౌట్​ కావడం వల్ల అత్యుత్సాహంతో ముందుకెళ్లాడు.

ఈ మ్యాచ్​లో భారత్​ ఇన్నింగ్స్​లోని చివరి పది ఓవర్లే తమ ఓటమికి కారణమని అన్నాడు పొలార్డ్.

"388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందు శతవిధాల ప్రయత్నించాం. అయితే భారత్ ఇన్నింగ్స్​లో చివరి పది ఓవర్లే మా గేమ్​ను మార్చాయి. 127 పరుగులు సమర్పించాం. అక్కడే మేం ఓడాం. అంతకుముందు వరకు మ్యాచ్ మాకు అనుకూలంగానే ఉంది" - కీరన్ పొలార్డ్

వెస్టిండీస్​తో రెండో వన్డేలో భారత్.. 107 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ శతకాలతో విధ్వంసం సృష్టించారు. మూడు వన్డేల సిరీస్​ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్​ ఈనెల 22న కటక్ వేదికగా జరగనుంది.

ఇదీ చదవండి: విశాఖలో రోహిత్ సునామీ.. మ్యాచ్​ గ్యాలరీ

Intro:Body:

dd

Conclusion:
Last Updated : Dec 19, 2019, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.