భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. చైనా, హాంకాంగ్, కొరియా మాస్టర్స్ టోర్నీల్లో ఆకట్టుకోని తెలుగు తేజం.. తాజాగా సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లోనూ నిరాశపరిచాడు. క్వార్టర్స్‌లో కొరియాకు చెందిన వ్యాన్హో చేతిలో పరాజయం పాలయ్యాడు.
పురుషల సింగిల్స్ విభాగంలో ప్రత్యర్థిపై 18-21, 19-21 తేడాతో వరుస సెట్లలో శ్రీకాంత్ ఓడాడు. రెండు గేముల్లోనూ చివరి వరకూ పోరాడినప్పటికీ అంతిమ విజయం వ్యాన్ హోనే వరించింది.
సౌరభ్పైనే ఆశలు..
సింగిల్స్‌లో ఇక ఆశలన్నీ సౌరభ్ వర్మపైనే ఉన్నాయి. థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవుట్పై విజయం సాధించి సెమీస్ చేరాడు. 21-19, 21-16 తేడాతో వరుస సెట్లలో నెగ్గాడు. సెమీ ఫైనల్లో కొరియా ఆటగాడు క్వాంగ్ హీతో తలపడనున్నాడు.
మహిళల సింగిల్స్ విభాగంలో రితుపర్ణా దాస్ మాత్రమే టైటిల్ రేసులో నిలిచింది. భారత్‌కే చెందిన శ్రుతి ముందాడపై 24-26, 21-10, 21-19 తేడాతో అతి కష్టం మీద గెలిచి సెమీస్ చేరింది.
ఇదీ చదవండి: రికార్డు: ఒక్క ఓవర్లో 5 వికెట్లు తీసిన బౌలర్