ఇటీవల చైనా ఓపెన్‌లో తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సైనా నెహ్వాల్.. హాంకాంగ్ ఓపెన్‌లోనూ సత్తాచాటలేకపోయింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో చైనీస్ యువక్రీడాకారిణి కై యన్ యన్ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తన కంటే తక్కువ ర్యాంకులో ఉన్న ప్రత్యర్థిపై 21-13, 22-20 తేడాతో వరుస సెట్లలో ఓడింది. కేవలం 30 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది చైనీస్ టీనేజర్. తొలి సెట్లో పెద్దగా ఆకట్టుకోని సైనా.. రెండో గేమ్‌లో పోరాడినప్పటికీ విజయం ప్రతర్థికే దక్కింది.
పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ.. చైనీస్ తైపీ షట్లర్ వాంగ్ జూ వీ చేతిలో పరాజయం చెందాడు. 11-21, 21-13, 21-8 తేడాతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టడం సమీర్‌కు వరుసగా ఇది మూడోసారి.
ఇదీ చదవండి: భారత్xబంగ్లా టెస్టుకు ప్రత్యేక అతిథులు