కొంతకాలంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. రాజకీయనాయకులు, సినీతారలు, క్రీడాకారులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. తాజాగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించింది. ఈ సందర్భంగా మొక్కలు నాటిన ఫొటోలను సామాజికమ మాధ్యమాల్లో పంచుకుంది సింధు.
"నన్ను నామినేట్ చేసినందుకు తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు. ఈ ఛాలెంజ్‌ను అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇస్తున్నాను."
-సింధు, బ్యాడ్మింటన్ స్టార్
మరో ట్వీట్లో "ఈ గ్రీన్ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని నేను అభినందిస్తున్నాను. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు మూడు మొక్కలు నాటి.. మరో ముగ్గురిని నామినేట్ చేయాలి. ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. నేను కోహ్లీ, అక్షయ్ కుమార్, సానియా మిర్జాలను నామినేట్ చేస్తున్నా" అంటూ చెప్పుకొచ్చింది.
-
I congratulate @MPsantoshtrs garu who started this #GreenIndiaChallenge where one has to plant 3 saplings🌳and nominate 3 more to do the same .Am happy to be a part of this noble cause and I further nominate @imVkohli @akshaykumar @MirzaSania pic.twitter.com/6lPzJH6uIA
— Pvsindhu (@Pvsindhu1) November 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I congratulate @MPsantoshtrs garu who started this #GreenIndiaChallenge where one has to plant 3 saplings🌳and nominate 3 more to do the same .Am happy to be a part of this noble cause and I further nominate @imVkohli @akshaykumar @MirzaSania pic.twitter.com/6lPzJH6uIA
— Pvsindhu (@Pvsindhu1) November 2, 2019I congratulate @MPsantoshtrs garu who started this #GreenIndiaChallenge where one has to plant 3 saplings🌳and nominate 3 more to do the same .Am happy to be a part of this noble cause and I further nominate @imVkohli @akshaykumar @MirzaSania pic.twitter.com/6lPzJH6uIA
— Pvsindhu (@Pvsindhu1) November 2, 2019
ఇవీ చూడండి.. బుమ్రా రన్నింగ్.. అభిమానులు ఖుష్