హాంకాంగ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీ రెండో రౌండ్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ ఓటమిపాలయ్యారు. ఇప్పటికే వరుస టోర్నీల్లో నిరాశపర్చిన సింధు ఈ టోర్నీలోనూ విఫలమవడం ఆందోళన కలిగించే విషయం.
ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తర్వాత మరే టోర్నీలోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది సింధు. తాజాగా హాంకాంగ్ ఓపెన్ రెండో రౌండ్లో బుసానన్ చేతిలో 18-21, 21-11, 16-21 తేడాతో పరాజయం చెందింది. ఫలితంగా ఈ టోర్నీలో భారత మహిళల సింగిల్స్ పోరు ముగిసింది. ఇప్పటికే సైనా తొలి రౌండ్లోనే ఓడి ఇంటిముఖం పట్టింది.
మరో ఆటగాడు పారుపల్లి కశ్యప్ చౌ టియాన్ చెన్ చేతిలో 21-12, 23-21, 21-10 తేడాతో ఓటమిపాలయ్యాడు. ప్రస్తుతం శ్రీకాంత్పైనే ఆశలున్నాయి. ఈ ఆటగాడు సౌరభ్ వర్మపై గెలిచి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు.
ఇవీ చూడండి.. 'విరామ సమయంలో హ్యాట్రిక్ గురించే ఆలోచించా'