ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కాంస్య విజేత సాయి ప్రణీత్ ఓ ఇంటివాడయ్యాడు. కాకినాడలోని తన స్వగృహం వద్ద ఆదివారం లక్ష్మీ శ్వేతను పెళ్లి చేసుకున్నాడు. ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకకు డబుల్స్ క్రీడాకారుడు సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి సహా పలువురు ప్రముఖులు, క్రీడాకారులు హాజరయ్యారు. మరికొందరు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
అర్జున నుంచి ఒలింపిక్స్‌కు...
ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ప్రణీత్. 1983 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ప్రకాశ్ పదుకొనే పతకం గెలిచిన తర్వాత మరోసారి మెడల్(కాంస్యం) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోనూ చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా క్రీడల్లో అత్యున్నత పురస్కారం అర్జున అవార్డునూ అందుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో 11వ స్థానంలో ఉన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడీ బ్యాడ్మింటన్ స్టార్.