ETV Bharat / sitara

రివ్యూ: మామా అల్లుళ్ల సందడే 'వెంకీమామ' - tollywood revies

వెంకటేశ్-నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన 'వెంకీమామ' నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఎంతవరకు ఈ మామా అల్లుళ్లు అలరించారో తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.

వెంకీమామ సినిమా రివ్యూ
వెంకీమామలో వెంకటేశ్-నాగచైతన్య
author img

By

Published : Dec 13, 2019, 1:24 PM IST

Updated : Dec 13, 2019, 1:59 PM IST

చిత్రం: వెంకీమామ
నటీనటులు: వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్
దర్శకుడు: కె.ఎస్.రవీంద్ర(బాబీ)
సంగీతం: తమన్
నిర్మాణ సంస్థలు: సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేది: 2019 డిసెంబర్ 13

మంచి కథ, అందులో తనకు సరిపోయే పాత్ర వస్తే జీవంపోసే నటుడు విక్టరీ వెంకటేశ్. అందుకే ఈ ఏడాది జనవరిలో 'ఎఫ్ 2'లో వరుణ్​తేజ్​తో కలిసి ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచాడు. బాక్సాఫీసును గలగలలాడించాడు. అలాగే ఒక్కో చిత్రంతో నటుడిగా తనను తాను ఆవిష్కరించుకుంటున్న యువహీరో నాగచైతన్య. 'మజిలీ'తో మరో మెట్టు ఎక్కి హిట్​ కొట్టాడు. ఈసారి ఈ మామా అల్లుళ్లిద్దరూ కలిసి బాక్సాఫీస్​ను షేక్ చేసేందుకు 'వెంకీమామ'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి వెంకీ, చైతూల సందడి ఎలా ఉంది? వీరిద్దరూ ఎలా నవ్వులు పంచారో ఆ చిత్ర సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

venkatesh-naga chaitanya
విక్టరీ వెంకటేశ్-యువ సామ్రాట్​ నాగచైతన్య

కథేంటంటే:

ద్రాక్షారామంలో మిలటరీ నాయుడు అలియాస్ వెంకటరత్నం(వెంకటేశ్ )కు సైన్యంలో చేరాలనేది కల. తన అక్కా బావ చనిపోవడం వల్ల తన మేనల్లుడు కార్తీక్(చైతన్య)కు అన్నీ తానై పెంచి పెద్ద చేస్తాడు. కార్తీక్​కు మేనమామ అంటే అంతులేని ప్రేమ. కానీ కార్తీక్ జాతక చ్రకం ప్రకారం మేనమామకు ప్రాణగండం ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న కార్తీక్.. తన మేనమామకు దూరంగా సైన్యంలో చేరుతాడు. ఓ ఆపరేషన్​లో ఉగ్రవాదులకు చిక్కుతాడు. ఈ విషయం తెలుసుకున్న మిలటరీ నాయుడు.. తన మేనల్లుడి కోసం ఎలాంటి త్యాగం చేశాడనేది వెంకీమామ కథ.

ఎలా ఉందంటే:

ఇలాంటి కథను ఇదివరకే తెలుగు ప్రేక్షకులు చూశారు. కృష్ణవంశీ తెరకెక్కించిన 'మురారి'ని బ్లాక్ బస్టర్ చేసి మహేశ్​బాబు కెరీర్​లో మరిచిపోలేని చిత్రంగా మలిచారు. ఇంచుమించు అలాంటి కథే ఈ వెంకీమామ. కృష్ణుడి జాతకంతో పుట్టిన కార్తీక్.. తన మేనమామ వెంకటరత్నంకు ఎలా ప్రాణగండంగా మారాడనే లైన్​తో దర్శకుడు బాబీ ఈ కథను సిద్ధం చేశాడు. ఫస్టాప్ మొత్తం మామా అల్లుళ్ల మధ్య అనుబంధాన్ని, వినోదాన్ని పంచుతూ సాగే కథలో ఇంటర్వెల్ సమయానికి కథలో కీలకంగా నిలిచే జాతకం విషయం బయటపడుతుంది. ఆ జాతకం మామ అల్లుళ్ల విషయంలో ఎలా నిజమైందో చూపించే క్రమంలో కొన్ని ప్రమాదాలను సృష్టించిన దర్శకుడు.. మేనమామకు దూరంగా వెళ్లిన కార్తీక్.. సైన్యంలో చేరడం, కార్తీక్​ను వెతుక్కుంటూ వెళ్లిన వెంకటరత్నం ఏం చేశాడనే అంశంతో కథను ముగించాడు.

ఎవరెలా చేశారు:

'వెంకీమామ' కథను వెంకటేశ్ పూర్తిగా భుజానికెత్తుకున్నాడు. ఎప్పటిలాగే తనదైన హాస్యం, సెంటిమెంట్, యాక్షన్​తో తెరపై సందడి చేశాడు. వెంకీకి తోడు చైతూ పోటీపడి నటించాడు. వెంకీతో చేసిన కామెడీ, సెంటిమెంట్ సీన్లలో తమ మధ్య ఉన్న మామా అల్లుళ్ల బంధాన్ని రియల్ లైఫ్​లోనే కాదు రీల్​లైఫ్​లోనూ నిజం చేసి చూపించారు. అలాగే రాశీఖన్నా, పాయల్.. మామా అల్లుళ్లకు జోడిగా ఆకట్టుకున్నారు. వెంకటేశ్ తండ్రిగా నాజర్, ఎమ్మెల్యేగా రావురమేశ్, సైనికాధికారిగా ప్రకాశ్​రాజ్ పరిధి మేర మెప్పించారు. దర్శకుడిగా బాబీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. రచయిత జనార్ధన మహర్షి కథను పాలీష్ చేసి మామా అల్లుళ్లను మిలటరీకి జతచేసి కథను పట్టాలెక్కించాడు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయనే చెప్పాలి. తమన్ సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

బలం:
వెంకటేశ్, చైతన్య, పాటలు, మాటలు

బలహీనతలు:
కథ, సెకండాఫ్

చివరకు: మామా అల్లుళ్లు అదరగొట్టారు

గమనిక: ఈ సమీక్ష కేవలం సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది మాత్రమే. ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York, 12 December 2019
1. Various of author J.K. Rowling on arrivals line at Ripple of Hope event
STORYLINE:
J.K. ROWLING HONORED IN NEW YORK
"Harry Potter" author J.K. Rowling was among those honored Thursday (12 DECEMBER) at the Ripple of Hope awards in New York City.
U.S. House Speaker Nancy Pelosi was also honored at the Robert F. Kennedy Human Rights organization's gala.
The organization said its awards celebrate "leaders of the international business, entertainment, political, and activist communities" for working towards "social change, equality, justice and global human rights."  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 13, 2019, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.