బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. ఇప్పటి వరకు వెండితెరపై అనేక రకాల సాహసోపేతమైన పాత్రల్లో నటించాడు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే యాక్షన్ సీక్వెన్స్‌తోనూ అదరగొట్టాడు. 'క్రిష్', 'ధూమ్', 'వార్' వంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణ. అయితే తానిప్పటి వరకు ఎన్ని పాత్రలు చేసినా ఓ ఛాలెంజింగ్ పాత్రను చేయలేదన్న లోటు ఇంతవరకు అలాగే ఉండిపోయిందంటున్నాడు హృతిక్.
ఇంతకీ హృతిక్ చేయలేకపోయిన అంతటి స్పెషల్ క్యారెక్టర్ ఏంటో తెలుసా.. పోలీస్ పాత్ర. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో అదిరిపోయే పోలీస్ అధికారి పాత్ర ఒక్కటి కూడా చేయలేకపోయాడట. అసలిలాంటి పాత్రతో ఏ దర్శక, నిర్మాత తనని సంప్రదించలేదట. ఒకవేళ ఇప్పుడెవరైనా తనకు సరిపడే పోలీస్ పాత్రతో వస్తే ఎలాంటి ఆలోచన లేకుండా ఓకే చెప్పేస్తానని చెబుతున్నాడు. అర్జెంటుగా బాలీవుడ్ ఫిలిం మేకర్లు తన కోసం శక్తిమంతమైన పోలీస్ పాత్రలు సృష్టించే ప్రయత్నం చేయాలని వేడుకున్నాడీ హీరో. గతేడాది 'సూపర్ 30', 'వార్' చిత్రాలతో వరుస హిట్లను ఖాతాలో వేసుకున్న హృతిక్.. ప్రస్తుతం 'క్రిష్ 4' చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు.
ఇవీ చూడండి.. హీరో సూర్య పాడిన 'మహా థీమ్' విడుదల