హీరోలు వెంకటేశ్- నాగచైతన్య.. నిజ జీవిత పాత్రల్లో నటించిన సినిమా 'వెంకీమామ'. అభిమానులను అలరిస్తూ వసూళ్ల సాధిస్తోందీ చిత్రం. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.45 కోట్ల వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. జాతకాల నేపథ్యంలో సాగుతుంది. మేనల్లుడి కోసం జీవితాన్ని త్యాగం చేసే మామగా వెంకటేశ్, మావయ్య కోసం అన్నింటినీ వదులుకున్న అల్లుడిగా నాగచైతన్య నటించారు.
ఇందులో హీరోయిన్లుగా పాయల్ రాజ్పుత్, రాశీఖన్నా నటించారు. కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించాడు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.