తమిళ కథానాయిక ఐశ్వర్య రాజేశ్ నటించిన మేయ్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ‘'ఇటీవల నాకు సాధారణ జ్వరం వచ్చింది. వైద్య పరీక్షల కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లా. వైద్యులు ఖరీదైన పరీక్షలు చేయించుకోవాలని చెప్పి, నన్ను వార్డులో చేర్చారు. తర్వాతి రోజు డిశ్చార్జ్ చేయమని అడిగితే... ఆదివారం డిశ్చార్జ్ చేయబోమని వైద్యులు అన్నారు. నాకు కోపం వచ్చింది. కేవలం కొన్ని పరీక్షలు చేసినందుకు రూ.లక్ష బిల్లు వేశారు. దాన్ని చూసి షాక్ అయ్యా. మరోదారిలేక బిల్లు కట్టాను. జ్వరం తగ్గడానికి సాధారణంగా వాడే డోలో మాత్రలు ఇచ్చి పంపారు.'’ అని ఆమె అసహనం వ్యక్తం చేసింది.
ఐశ్వర్య కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె తెలుగులో నేరుగా నటించిన సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ ప్రధాన పాత్రలు పోషించింది. తమిళ హీరో శివ కార్తికేయన్ అతిథి పాత్రలో కనిపించనుడు. ఆగస్టు 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
- ఇదీ చూడండి : హిందీ షోలో ప్రభాస్ డ్యాన్స్.. నెట్టింట ఫొటో వైరల్