ఒకవైపు గ్లామర్ పాత్రల్లో కనిపిస్తూనే మరోవైపు 'బాహుబలి', 'సైరా' లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం మాస్ హీరో విశాల్ సరసన 'యాక్షన్' సినిమాలో నటించింది. సుందర్.సి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా మిల్కీ బ్యూటీ తమన్నా ఇంటర్వ్యూ మీకోసం.
ప్రతి సంవత్సరం డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ స్క్రిప్ట్‌లు మీ ముందుకు వస్తున్నప్పుడు మీరెలా ఫీల్ అవుతుంటారు..?
నా కెరీర్‌లో డిఫరెంట్ జోనర్స్‌లో డిఫరెంట్ రోల్స్ చేసే అవకాశం దక్కినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని సార్లు నేను ఊహించకుండానే మంచి క్యారెక్టర్స్ వస్తుంటాయి. దానికి నేను లక్కీగా ఫీల్ అవుతాను. ఒక యాక్టర్‌గా ఎప్పుడూ కొత్త తరహా పాత్రలు చేయాలనే కోరుకుంటాను. అలాంటి విభిన్న తరహా పాత్రలకు నన్ను సెలెక్ట్ చేస్తున్నందుకు దర్శకులకు, నిర్మాతలకు ధన్యవాదాలు.
కెరీర్ పరంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉంది..?
ఈ ఏడాది ప్రారంభంలోనే 'ఎఫ్ 2 'తో మంచి విజయం లభించింది. అలాగే గొప్ప చారిత్రాత్మక చిత్రం అయిన "సైరా"లో విప్లవమాత్మకంగా ఉండే లక్ష్మీ క్యారెక్టర్.. నటిగా నాకు మంచి పేరు, ప్రశంసలు తీసుకువచ్చింది. ఇప్పుడు 'యాక్షన్' మూవీకి కూడా గ్యారెంటీగా నాకు మంచి పేరు వస్తుందనే నమ్మకంతో ఉన్నాను.
ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో విశాల్, నేను కమాండోస్‌గా కనిపిస్తాం. మామూలుగా మీరు హాలీవుడ్ యాక్షన్ మూవీస్ చూస్తే అందులో హీరోయిన్స్ 'షీరో'గా ఉంటారు. అంటే గ్లామరస్‌గా కనిపిస్తూనే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ అలానే ఉంటుంది.
ఈ పాత్ర గురించి చెప్పగానే ఎలా ఫీల్ అయ్యారు..?
సుందర్.సి సర్ నాకు ఫోన్ చేసి ఈ క్యారెక్టర్ నువ్వే చెయ్యాలి అన్నారు. నేను ఎప్పటినుండో ఆయన దర్శకత్వంలో పని చేయాలి అనుకుంటున్నాను. నాకు స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. అందులోనూ రెగ్యులర్‌గా కాకుండా నాకు కొత్తగా ఉంది. ఈ పాత్ర నాకు ఫ్యూచర్‌లో కూడా యాక్షన్ సీక్వెన్స్‌లు చేయగలను అనే నమ్మకాన్ని ఇచ్చింది. ఈ జోనర్‌లో నేను మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా.
ట్రైలర్ చూస్తుంటే విజువల్స్ చాలా గ్రాండియర్‌గా కనిపిస్తున్నాయి కదా. ఏ ఏ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు..?
ఈ సినిమా కోసం అజర్ బైజాన్, టర్కీ, రిశికేష్ ఇలా చాలా ప్రదేశాలు ట్రావెల్ చేశాం. అక్కడ యాక్షన్ సీన్లు తీయడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. సెక్యూరిటీ, పర్మిషన్స్ ఇలా చాలా అంశాలు ఉంటాయి. అయితే అందరు పూర్తిగా సహకరించడం వల్ల మా పని తొందరగా అయిపోయింది.
యాక్షన్ సీక్వెన్సులు చేయడం కష్టంగా అనిపించిందా..?
ఈ సినిమాలో 'యాక్షన్' ఎపిసోడ్స్ అన్నీ రియాలిటీకి దగ్గరగా ఉండేలా చూసుకున్నాం. అలాగే కాస్ట్యూమ్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. వాటితో యాక్షన్ సీన్లు చేయడం కొంచెం కష్టమే. అయినా మా టీమ్ అందరం చాలా కష్టపడి సినిమా చేశాం. దానికి తగ్గ ప్రతిఫలం వస్తుందనే అనుకుంటున్నాం.
విశాల్‌తో సెకండ్ మూవీ కదా ఎలా అనిపించింది..?
ఎమోషన్ సరైన విధంగా కనెక్ట్ అయితేనే ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రేక్షకులు విశాల్ ఎమోషన్‌కి కనెక్ట్ అవుతారు కనుకనే ఆయన యాక్షన్‌ను అంతలా ఇష్టపడతారు. విశాల్ సెట్‌లో ఒక డేర్‌డెవిల్‌లా పెర్ఫామ్ చేస్తారు. ఈ సినిమా తప్పకుండా ఫ్యాన్స్‌కి పండుగలా ఉంటుంది. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది.
ఇవీ చూడండి.. 'ఆర్ఆర్ఆర్' అభిమానుల కోసం చెర్రీ అప్డేట్