అల్లు అర్జున్-పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో టబు ఓ కీలకపాత్ర పోషిస్తోంది. అయితే ఈరోజు టబు పుట్టినరోజు సందర్భంగా తన లుక్కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. తనతో మరిన్ని చిత్రాలు చేయాలని ఆకాంక్షించింది.

ఈ సినిమాలో సుశాంత్, నవదీప్, సునీల్, నివేదా పేతురాజ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు ఇప్పటికే భారీ ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. 'అసురన్' దర్శకుడితో షారుఖ్ సినిమా..!