బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్.. తమిళ దర్శకుడు అట్లీ కలిసి పనిచేసేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో త్వరలో ఓ చిత్రం పట్టాలెక్కనుందని.. దీనికి 'సంకి' అనే పేరు పెట్టనున్నట్లు సినీ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిలా ఉండగా మరో తమిళ దర్శకుడి పేరు ఇప్పుడు తెరమీదకొచ్చింది.
ఇటీవలే 'అసురన్' సినిమాతో ఘన విజయం అందుకున్నాడు దర్శకుడు వెట్రిమారన్. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ డైరెక్టర్ షారుఖ్‌తో కలవడం మరోసారి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు వార్తలూ వచ్చాయి.
ఈ విషయంపై వెట్రిమారన్ స్పందిస్తూ.. "అసురన్ సినిమా షారుఖ్ చూశాడు. అతడికి బాగా నచ్చింది. ఓసారి కలుద్దాం అన్నాడు. అందుకే కలిశాం" అని స్పష్టత ఇచ్చాడు.
షారుఖ్ తమిళ సినిమాలో నటించడం ఇదేమి తొలిసారి కాదు. 'హే రామ్' సినిమాలో కమల్ హాసన్ సోదరుడి పాత్రను పోషించాడు. దక్షిణాదిలో జరిగే పలు వేడుకలకు షారుఖ్ హాజరవుతుంటాడు. గతంలో ఇతడు తీసిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో రజినీ పేరుతో పాట పెద్ద హిట్టయింది.
ఇవీ చూడండి.. జేజమ్మ పాత్రలో దీపికా పదుకొణె..!