హిందీ నటి సారా అలీఖాన్.. నిత్యం తన అభిమానులకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తుంటుంది. అలానే మంగళవారం.. తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకుని, అభిమానులకు షాకిచ్చింది. సినిమాల్లోకి రాకముందు కాస్త బొద్దుగా ఉండేదని స్పష్టం చేసింది. దానికి తోడుగా ఓ సరదా సందేశాన్నీజత చేసింది.
ఈ వీడియోకు 'ప్యాసా' చిత్రంలోని 'సర్ జో తేరా చక్రయే..' పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో జోడించింది. "దేన్నయినా 'తేలికగా' చేద్దాం .. గతంలో కంటే దాన్ని మరింత తేలికగా మారుద్దాం" అనే అర్థంలో సందేశం రాసుకొచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం ఈ భామ వరుణ్‌ధావన్‌తో కలిసి 'కూలీ నం.1', కార్తిక్ ఆర్యన్‌తో కలిసి 'లవ్ ఆజ్ కల్' సినిమాలో నటిస్తుంది. ఇంతకు ముందు 'కేదార్నాథ్', 'సింబా' చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: దసరా బరిలో చిరు-బాలయ్య.. అభిమానులకు పండగే!