నాగ చైతన్య, సాయిపల్లవి.. ప్రస్తుతం 'లవ్‌స్టోరి' సినిమాలో జంటగా నటిస్తున్నారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం.. భోగి సందర్భంగా విడుదల చేసింది.ఇందులో హీరోయిన్.. చైతూ చొక్కా పట్టుకున్న స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. అభిమానులకు ఇది నచ్చినా, అక్కినేని హీరో సతీమణి సమంతకు మాత్రం కోపం తెప్పిస్తోందట. ఈ పోస్టర్‌పై వచ్చిన ఓ మీమ్‌ను ఇన్‌స్టాలో పంచుకొని, నెటిజన్లను నవ్విస్తోంది.
ఈ ఫొటోలు బ్రహ్మానందం కత్తిపట్టుకుని.. "వదులు షర్ట్ వదులు.." అని సాయిపల్లవిని బెదిరిస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం సమంత ఫీలింగ్ ఇదేనట. దీనిని సామ్.. ఇన్‌స్టా స్టోరీలో పంచుకొని.. "అవును" అంటూ జిఫ్ పోస్ట్ చేసింది.
'లవ్‌స్టోరి'కు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంత.. 'జాను'లో శర్వానంద్ సరసన ప్రస్తుతం నటిస్తోంది. తమిళ హిట్ '96'కు రీమేక్ ఇది. త్వరలో థియేటర్లలోకి రానుంది.
ఇవీ చూడండి.. పూజాహెగ్డే కోసం ఐదు రోజులు రోడ్డుపైనే