రానా.. కథానాయకుడిగా నటిస్తూనే.. అవకాశం దొరికినప్పుడల్లా ప్రతినాయక పాత్రలతోనూ అలరిస్తున్నాడు. అందుకే ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ యువ హీరో ఓ బాలీవుడ్ హిట్ రీమేక్‌పై ప్రస్తుతం కన్నేశాడట. మినీ మల్టీస్టారర్‌గా రూపొందబోయే ఈ చిత్రంలో మరో కథానాయకుడు విశ్వక్సేన్తో తెర పంచుకోబోతున్నాడట.
కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించిన 'సోను కే టిటు కి స్వీటీ'. ఈ సినిమాతోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడీ కథ రానాకు విపరీతంగా నచ్చేసింది. వెంటనే పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చమని ఓ స్టార్ దర్శక రచయితకు బాధ్యతలు అప్పగించాడట.
ఇందులో మరో కథానాయకుడి పాత్ర కోసం విశ్వక్ సేన్‌ను తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు రానా. ఇటీవలే వీళ్లిద్దరూ కలిశారు. సోషల్ మీడియాలో ఈ ఫొటో చక్కర్లు కొట్టింది.
ఇది చదవండి: '1945' నిర్మాత మోసంపై హీరో రానా ఆగ్రహం