విభిన్న పాత్రలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో హీరోయిన్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది నటి రాధికా ఆప్టే. తన అందంతో యువతను కట్టిపడేసే ఈ భామ.. వయసులో తనకంటే చిన్న వాడితో ఎప్పుడూ డేట్‌కు వెళ్లలేదని చెబుతోంది.
వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంటూ..
దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న రాధిక.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చింది. అందులో పలు ఆసక్తికర విషయాలను చెప్పింది.
"వయసులో నాకంటే చిన్నవాడితో ఎప్పుడూ డేట్‌కు వెళ్లలేదు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు.. ఒకానొక సమయంలో ఇద్దరు అబ్బాయిలు నన్ను డేట్‌కు రమ్మని పిలిచారు. అందులో ఒకతను నాకంటే వయసులో చిన్నవాడు. వాళ్లిద్దరూ డేట్‌కు రమ్మంది ఒకే రోజు. ఒకే సమయం. నాకేం చేయాలో తోచలేదు. అప్పుడు మా ఇంటికి ప్రతిరోజూ ఒక పిల్లి వస్తుండేది. దానికి నేను ఓ చేప పిల్లను ఆహారంగా అందించేదాన్ని. వాళ్లు రమ్మని అడిగినప్పుడు.. నేను ఇంటికి వెళ్లి పిల్లికి చేపను ఆహారంగా అందించా. ఒకవేళ అది చేపను తింటే ఒక అబ్బాయితో.. తినకపోతే నాకంటే చిన్నవాడితో వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఆ రోజు పిల్లి చేపను తింది. అలా నేను ఒకబ్బాయితో డేట్‌కు వెళ్లా. తర్వాత అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నా. తనే నా భర్త బెనిడిట్క్"
- రాధికా ఆప్టే, నటి
ప్రస్తుతం రాధిక.. 'ద వెడ్డింగ్ గెస్ట్', 'ద ఆశ్రమ్' అనే హాలీవుడ్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తోంది.
ఇదీ చదవండి: ఈ సినిమా మా అమ్మకు అంకితం: కంగనా