దిల్లీ కాలుష్యం గురించి చాలా ఆందోళనగా ఉందంటుంది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. తన కొత్త సినిమా షూటింగ్ కోసం దిల్లీ వెళ్లిన ఈ భామ కాలుష్యాన్ని తట్టుకోలేకపోతున్నా అంటూ ముఖానికి మాస్క్ ధరించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టింది.
"షూట్ డేస్ ఫర్ ది వైట్ టైగర్. ఇక్కడ షూటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలిక్కడ ఎలా జీవించాలో అర్థం కావట్లేదు. ఎయిర్ ఫ్యూరిఫయర్స్, మాస్క్‌లు మమ్మల్ని బతికిస్తున్నాయి. ఇళ్లు లేని నిరాశ్రయుల కోసం ప్రార్థిస్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి."
-ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నటి
మ్యాన్ బుకర్ ప్రైజ్ సాధించిన అరవింద అడిగా పుస్తకం 'ది వైట్ టైగర్' ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రమిన్ బహ్రాని దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇవీ చూడండి.. ఉగాదికి వైలెన్స్‌తో వస్తున్నా: నాని