హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. అందుకు అనుగుణంగానే భారీ బడ్జెట్ చిత్రాలను పక్కా ప్రమోషన్స్తో భారత ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగా ఇక్కడి నటులతో డబ్బింగ్ చెప్పించడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే 'లయన్ కింగ్'లోని పాత్రలకు నాని, జగపతిబాబు, బ్రహ్మానందం వంటివారు తమ గొంతు అరువిచ్చారు.
తాజాగా 'ఫ్రోజెన్ 2' లోని ఎల్సా పాత్ర కోసం నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పనుంది. ఇప్పుడు ఈ లిస్టులో ప్రియదర్శి కూడా చేరిపోయాడు. ఇదే చిత్రంలోని ఐకానిక్ పాత్ర అయిన ఫన్నీ స్నో మ్యాన్ ఒలఫ్కు డబ్బింగ్ చెప్పనున్నాడీ హాస్యనటుడు.
డిస్నీ రూపొందించిన యానిమేషన్ మూవీ 'ఫ్రోజెన్' 2013లో విడుదలై ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. ఆ ఏడాది ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా 'ఫ్రొజెన్ 2'ను తీసుకురానున్నారు. ఈ మూవీ ఈనెల 22న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇవీ చూడండి.. మంజు వారియర్ స్థానంలో శ్రియ..!