అగ్రకథానాయకుడు చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్‌కు... భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆహ్వానం వచ్చిందట. ఇటీవల బాలీవుడ్ సినీ ప్రముఖులను మోదీ దిల్లీకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హిందీ పరిశ్రమకు చెందిన హీరో హీరోయిన్లు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇలా మోదీ కేవలం బాలీవుడ్ ప్రముఖుల్ని మాత్రమే పిలవడంపై రామ్‌చరణ్ సతీమణి ఉపాసన అసంతృప్తి వ్యక్తం చేసింది. దక్షిణాదిని నిర్లక్ష్యం చేశారని, ఇక్కడి వారినీ గుర్తించాలని విజ్ఞప్తి చేసింది.
-
Jai Hind @narendramodi ji. 🙏🏻 pic.twitter.com/11olAv1tsV
— Upasana Konidela (@upasanakonidela) October 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jai Hind @narendramodi ji. 🙏🏻 pic.twitter.com/11olAv1tsV
— Upasana Konidela (@upasanakonidela) October 19, 2019Jai Hind @narendramodi ji. 🙏🏻 pic.twitter.com/11olAv1tsV
— Upasana Konidela (@upasanakonidela) October 19, 2019
తాజాగా ఇప్పుడు దిల్లీకి రమ్మని మోదీ నుంచి చిరు, చరణ్‌కు ఆహ్వానం వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు చరణ్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడినట్లు తెలుస్తోంది. "నేను, నాన్న ప్రధానిని కలవబోతున్నాం. త్వరలోనే ఇది జరుగుతుంది. ఈ సమావేశం కోసం మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని చరణ్ తెలిపాడట.
ఇవీ చూడండి.. క్రిస్మస్ కానుకగా 'ఇద్దరి లోకం ఒకటే'..