బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు విపరీతంగా ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా అనుష్కతో తన బంధం గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో స్వీటీతో ప్రేమ-పెళ్లి అంటూ వస్తున్న ఊహాగానాలపై స్పష్టత ఇచ్చాడు రెబల్ స్టార్. తమ మధ్య స్నేహం తప్ప మరేదీ లేదని ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
"అనుష్క చాలా అందమైన హీరోయిన్. ఆమె నాకు 11 ఏళ్ల నుంచి తెలుసు. మేమిద్దరం కలిసి సినిమాలు చేశాం. అందువల్ల మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు. బాహుబలితో ఆ పుకార్లు ఇంకా ఎక్కువయ్యాయి. స్నేహం తప్ప మా ఇద్దరి మధ్య ఏమీ లేదని ఎన్నో సార్లు చెప్పా. ఇప్పుడూ అదే చెబుతున్నా".
- ప్రభాస్.
-ప్రభాస్.
ప్రభాస్ నటించిన 'సాహో' ఇటీవల విడుదలై... ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.
ఇదీ చదవండి: కోహ్లీకి అనుష్క బహుమతి.. భూటాన్లో విహారయాత్ర