'బాహుబలి', 'సాహో'.. ఇలా వరుసగా యాక్షన్ ప్రాధాన్యం ఉన్న కథలనే ఎంచుకుంటున్న ప్రభాస్.. తన పంథా మార్చుకున్నాడు. 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. లవ్‌స్టోరీ ప్రధానంగా వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం.
త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుందట చిత్రబృందం. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన సెట్‌ని రూపొందించింది . కళా దర్శకుడు ఎస్.రవీందర్ ఆధ్వర్యంలో దాదాపు రూ.1.5 కోట్ల వ్యయంతో రైలు సెట్‌ను వేశారు. అందులో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
11 రోజుల పాటు ఈ సెట్‌లో షూటింగ్ జరగబోతోందట. ఈ చిత్రానికి 'జాన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తోందట చిత్రబృందం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 2020 వేసవిలో ఈ చిత్రం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు.
ఇదీ చదవండి: నిర్మాతగానూ నువ్వు స్టార్ కావాలి విజయ్..!