ప్రముఖ నటి పూజా కుమార్.. ఈ మధ్య నెట్టింట బాగా హల్చల్ చేసింది. కోలీవుడ్ హీరో కమల్ హాసన్ ఇటీవలే 65వ పుట్టినరోజు వేడుకలను సొంత ఊరు పరమకుడిలో జరుపుకొన్నారు. ఆ సందర్భంగా కమల్ కుటుంబంతో పాటు పూజా ఉండటమే ఇందుకు కారణం.
కమల్‌తో 'విశ్వరూపం', 'ఉత్తమ విలన్', 'విశ్వరూపం 2'లో నటించింది పూజా. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్‌లతో కలిసి దిగిన ఫొటోను ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
"నేను గొప్ప అదృష్టవంతురాలిని. భారతదేశం గర్వించదగ్గ ఇద్దరు మహానుభావుల మధ్య ఉన్నాను. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను"
-ఇన్‌స్టాలో పూజా కుమార్
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
పూజా.. తెలుగులో హీరో రాజశేఖర్‌తో కలిసి 'పీఎస్‌వీ గరుడ వేగ'లో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో 'ది ఇన్విజబుల్ మాస్' అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇది చదవండి: సొంత గొంతు వినిపిస్తూ మనసు దోచేస్తున్న భామలు