పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త. పవన్ కల్యాణ్‌ను మళ్లీ వెండితెరపై చూపించేందుకు తెర వెనుక రంగం అంతా సిద్ధమైపోయింది. ఇప్పటికే ఆయన దర్శకుడు క్రిష్ చెప్పిన ఓ జానపద కథకు పచ్చజెండా ఊపేయగా.. తాజాగా 'పింక్' రీమేక్‌కు కూడా సై అన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ విషయంపై ట్వీట్ చేయగా నిర్మాత బోనీ కపూర్ రీట్వీట్ చేశారు. అంతే నెట్టింట సందడి నెలకొంది.
ఈ వార్తతో సందేహంలో ఉన్న ఫ్యాన్స్‌కు ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. పవన్ కొత్త సినిమా ఖరారైందని తెలిసి అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ పవర్‌స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజుతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ 'పింక్' సినిమాను నిర్మించబోతున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు.
'పింక్'లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించారు. 2016 సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయం సాధించింది. ఇదే సినిమాను తమిళంలో అజిత్‌తో బోనీ కపూర్ నిర్మించారు. కోలీవుడ్‌లోనూ హిట్ అందుకుని, చక్కటి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు తెలుగులోనూ ఈ సినిమా సందడి చేయబోతోంది. పవన్ 2018లో వచ్చిన 'అజ్ఞాతవాసి'లో చివరిసారి వెండితెరపై కనిపించాడు. ఈ సినిమా తర్వాత ఆయన ఎన్నికల ప్రచారం, రాజకీయాలతో బిజీ అయ్యాడు.
ఇవీ చూడండి.. 'ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ'గా రజనీకాంత్