భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ తెరకెక్కించనున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన జీవిత చరిత్రలో నటించేది ఎవరో తెలిసిపోయింది. బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్.. కలాం బయోపిక్‌లో నటించనున్నాడు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
-
In my humble opinion he was SAINT KALAM !i am so blessed and fortunate that I will be playing KALAM Saab in his biopic . https://t.co/0e8K3O6fMB
— Paresh Rawal (@SirPareshRawal) January 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">In my humble opinion he was SAINT KALAM !i am so blessed and fortunate that I will be playing KALAM Saab in his biopic . https://t.co/0e8K3O6fMB
— Paresh Rawal (@SirPareshRawal) January 4, 2020In my humble opinion he was SAINT KALAM !i am so blessed and fortunate that I will be playing KALAM Saab in his biopic . https://t.co/0e8K3O6fMB
— Paresh Rawal (@SirPareshRawal) January 4, 2020
"కలాం బయోపిక్‌లో నటించనుండటం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన చాలా మహోన్నత వ్యక్తిత్వం గలవారు" -పరేశ్ రావల్
ఈ బయోపిక్‌ను అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని పట్టాలకెక్కించనున్నట్లు అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
"ఇది అంతర్జాతీయ ప్రాజెక్ట్. ప్రముఖ రచయిత రాజ్ చెంగప్ప కథ సమకూరుస్తున్నాడు. పుస్తకం హక్కులు సొంతం చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్ మొదలుపెడతాం. ఈ చిత్రం ప్రధానంగా ఆయన జీవితం గురించి.. పోఖ్రాన్ అణుపరీక్షల సమయంలో ఆయన పాత్ర గురించి ఉంటుంది " - అభిషేక్ అగర్వాల్, సినీ నిర్మాత
ఈ సినిమా హిందీ, ఆంగ్ల భాషల్లో తెరకెక్కనుంది. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరో ప్రకటించనున్నారు.
పరేశ్ రావల్.. 'క్షణక్షణం', 'మనీ', 'శంకర్ దాదా ఎంబీబీఎస్' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ముఖ్యంగా 'శంకర్‌దాదా ఎంబీబీఎస్' చిత్రంలో ఆయన పోషించిన లింగం మామయ్య పాత్రను అంత త్వరగా మర్చిపోలేం.
ఇదీ చదవండి: వచ్చే వారం నుంచి షూటింగ్లో బిజీబిజీగా ప్రభాస్