టాలీవుడ్ హీరో నితిన్ కొత్త చిత్రం భీష్మ. ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. రష్మిక మందణ్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. పంచ్ డైలాగులతో నితిన్ అదరగొట్టాడు. 'అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం దబ్బకాయంత ఉంది' అంటూ సాగే డైలాగులతో టీజర్ ఆకట్టుకుంటోంది.
శ్రీనివాస కల్యాణం చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న నితిన్ ఈ సినిమాతో ప్రేకక్షకులు ముందుకు వస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: గంటపాటు ఏడ్చిన నయన్.. కారణమేంటో తెలుసా?