ఉస్మానియా విద్యార్థి నాయకుడు 'జార్జ్‌రెడ్డి' జీవితం ఆధారంగా వస్తోన్న చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించాడు. ఆ నాయకుడి జీవితం నేటితరం కుర్రాళ్లకు స్ఫూర్తి అని అభివర్ణించాడు. అంతేకాకుండా సినిమా కూడా అందరికీ నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ నెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా జార్జ్రెడ్డిలోని 'అడుగడుగు మా ప్రతి అడుగూ' పాటను నేడు విడుదల చేశాడు చిరు. ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలు, నటీనటులకు అభినందనలు తెలిపాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడు జార్జ్‌రెడ్డి జీవితంలో ప్రధాన సంఘటలను ఇందులో చూపించనున్నారు. 1970లో యూనివర్సిటీలో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించారట. 'వంగవీటి' ఫేమ్ సందీప్ మాధవ్ ప్రధాన పాత్ర పోషించగా... జీవన్‌రెడ్డి దర్శకత్వం వహించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: 'జార్జ్ రెడ్డి'.. ఉస్మానియా వీరుడి ఉద్యమ యాత్ర