మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవలే 'సైరా' అంటూ పలకరించాడు. ఇప్పుడు తన తర్వాతి సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకోసం జిమ్లో కసరత్తులు చేస్తున్నాడు. ఆ ఫొటో ఇప్పుడు వైరల్గా మారింది.
చిరంజీవి 152వ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకుడు. రామ్చరణ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే నెల తొలివారం నుంచి షూటింగ్ మొదలు కానుంది. వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో హీరోయిన్గా త్రిషను తీసుకోవాలని భావిస్తోంది చిత్రబృందం. ఈ సినిమాకు 'గోవింద ఆచార్య', 'గోవిందా హరి గోవిందా' అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది చదవండి: చిరు తర్వాతి సినిమాలో డబుల్ ధమాకా..!