ప్రముఖ గాయని లతా మంగేష్కర్.. శ్వాస సమస్యల కారణంగా సోమవారం ఉదయం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆమె కోలుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
"ఆమె(లతా మంగేష్కర్) వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు" -రచనా సిన్హా, మంగేష్కర్ మేనకోడలు
ఇటీవలే సెప్టెంబరు 28న.. లతా 90 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు పలు భాషల్లో దాదాపు 1000కి పైగా పాటలు పాడారు. 2001లో భారతరత్న అవార్డును సొంతం చేసుకున్నారు.
లతా మంగేష్కర్.. చివరగా మార్చి 30న విడుదలైన 'సౌగంధ్ ముజే ఇస్ మిట్టీ కీ' అనే పాట పాడారు. ఆమె 75 ఏళ్ల వయసులో.. 2004లో 'వీర్-జారా' ఆల్బమ్ ఆలపించారు.
1942లో ప్లేబాక్ సింగర్‌గా మొదలైన లతా మంగేష్కర్ ప్రయాణం.. ఇప్పటివరకు ఎన్నో మధురమైన గీతాల్ని తన గొంతిచ్చారు. 1989లో ప్రఖ్యాత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు.