బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'సూర్యవంశీ'అనే చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. అయితే ఈ చిత్రం తరువాత షారుక్ ఖాన్, దర్శకనిర్మాత అయిన ఆనంద్ ఎల్.రాయ్‌లు కలిసి నిర్మించనున్న చిత్రంలో కత్రినా నటించనుందని చెప్పుకుంటున్నారు.
కొరియాలో విడుదలైన 'మిస్ అండ్ మిస్టర్స్.కాప్స్' అనే చిత్రాన్ని రీమేక్‌గా షారుక్ - ఆనంద్‌లు కలిసి నిర్మించనున్నారని సమాచారం. అయితే ఇప్పటి వరకూ ఎక్కడ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. కత్రినా కైఫ్ ఇందులో పోలీస్ అధికారిగా కనిపించనుందట. చిత్రం అంతా కామెడీ - యాక్షన్ నేపథ్యంలో ఉంటుందట.
కత్రినా ఇప్పటి వరకు సోలోగా కనిపించిన సినిమాలు చాలా తక్కువ. ప్రకాష్ ఝా దర్శకత్వంలో వచ్చిన 'రాజ్‌నీతి' చిత్రంలో కత్రినా రాజకీయవేత్తగా నటించి మెప్పించింది. కత్రినా - షారుక్‌లు కలిసి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించిన 'జీరో' చిత్రంలో నటించారు.
ఇవీ చూడండి.. 'విజిల్' స్టార్‌కు నయనతార సర్ఫ్రైజ్