ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత, గాయకుడైన కిచ్చా సుదీప్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఈ ఏడాదిలోనే ఓ నూతన చిత్రానికి దర్శకత్వం చేయాలని అనుకుంటున్నాడట. గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు సుదీప్.
ట్విట్టర్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.."కచ్చితంగా మీకు ఆనందం కలిగించే వార్తను చెబుతాను. ఈ ఏడాదిలోనే దర్శకత్వం చేస్తాను. త్వరలోనే సాంకేతిక నిపుణుల బృందాన్ని మిగతా వివరాలను తెలియజేస్తాను" అని చెప్పాడు. అయితే ఈ చిత్రం ఏ ఇతర భాషలకు రీమేక్ చిత్రం కాదట. ఇంకా స్క్రిప్టుని పూర్తి సిద్ధం చేసేందుకు చిత్రబృందంతో పాటు, తన రచయితల సలహాలను కూడా తీసుకుంటున్నాడట ఈ హీరో.
ఇవీ చూడండి.. 'బాహుబలి తర్వాత గడ్డం మీద విరక్తి కలిగింది'